శ్రీశైల దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు- సంప్రదాయ రీతిలో ఏర్పాట్లు -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఆగస్టు 9, శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి సెప్టెంబరు7. శ్రావణ అమావాస్య వరకు శ్రావణ మాసోత్సవాల  నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని  దేవస్థానం ఈ ఓ   కే ఎస్. రామరావు తెలిపారు. ముఖ్యంగా శ్రావణమాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ శ్రావణమాసోత్సవాలు నిర్వహించేలా చర్యలు ఉంటాయి.

 శ్రావణమాసంలో పర్వదినాలు, ప్రభుత్వ సెలవు రోజులను రద్దీరోజులుగా గుర్తించారు.

ముఖ్యంగా క్యూలైన్లలో ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరం పాటించడంలాంటి అంశాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఉద్యోగులే కాకుండా స్థానికులు, యాత్రికులు కూడా తప్పనిసరిగా ముందుజాగ్రత్తలు పాటించేవిధంగా అందరిలో అవగాహనను కల్పించేలా చర్యలు ఉంటాయి .విధగా కల్యాణకట్ట, సేవాకౌంటర్లు, దర్శనక్యూలైన్లు, ప్రసాద విక్రయకేంద్రం మొదలైన అన్నిచోట్ల ఎటువంటి లోపం లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించేవిధంగా పాటించేవిధంగా తగు చర్యలు ఉంటాయి. 

ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకు  తీసుకోవలసిన ముందుజాగ్రత్తల గురించి దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం తెలియజేసేలా ఏర్పాట్లను చేస్తున్నారు.

శ్రావణమాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, ఎకాదశులు, శ్రావణపౌర్ణమి, మాసశివరాత్రి, ప్రభుత్వ సెలవురోజులలో భక్తుల రదీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈ రద్దీరోజులలో క్యూకాంప్లెక్స్లో  మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చేస్తారు. క్షేత్ర పరిధిలోని ప్రధాన రహదారులు, అతిథిగృహాలు, కల్యాణకట్ట

అతిథిగృహాలు, కల్యాణకట్ట ప్రాంగణం, డార్మెటరీలు మొదలైనవాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకుంటారు.

అదేవిధంగా శౌ చాలయాల నిర్వహణలో శుభ్రతాపరంగా ఎటువంటిలోపం లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, అవసరమైన అన్నిచోట్ల కూడా మరిన్ని చెత్తబుట్టలను ఏర్పాటు చేసేలా చర్యలు ఉంటాయి.

శ్రావణంలో భక్తులు ఆలయాన్ని అధికంగా సందర్శించడంతో మంచినీటి సరఫరాలో ఎటువంటిలోపం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భక్తుల కు   రెండవ శుక్రవారం (20.08.2021) , శ్రావణ నాలగవ శుక్రవారం (03.09.2021) రోజులలో వరలక్ష్మీవ్రతాన్ని పరోక్షసేవగా నిర్వహిస్తారు.

print

Post Comment

You May Have Missed