కర్నూలు జిల్లా 54వ కలెక్టర్ గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు (30-07-2021)న కలెక్టర్ ఛాంబర్ లో ఉదయం 10:08 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య ఆశీస్సులు తీసుకొని బాధ్యతలు తీసుకున్నారు.
నూతన జిల్లా కలెక్టర్ ను అధికారులు అభినందనలతో ముంచెత్తారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు వరుసగా వెళ్లి తమ పేరు, శాఖ, హోదాలతో కలెక్టర్ తో పరిచయం చేసుకొని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి జిల్లా కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మండల రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి ఆర్ ఓ పుల్లయ్య, ఆర్ డి ఓ హరిప్రసాద్, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, జిల్లా ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు చెప్పారు.
ఈ రోజు మధ్యాహ్నం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా అధికారుల సమీక్ష సమావేశానికి పి. కోటేశ్వరరావు హాజరయ్యారు.