మహాత్యా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష 25 – 7 – 2021 ఆదివారం నాడు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ఆన్ లైన్ లో mjpubcwreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడు చేసుకోవాలని మ.జ్యో.పూ.వె.త.గ.వి. సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. విద్యార్థులు ఉదయం 9 గం || వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలని ఆయన తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాల్లో, మహిళా డిగ్రీ కళాశాల్లో మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ కోర్సులు) ప్రవేశపెట్టామన్నారు. ప్రవేశపరీక్ష కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ లో ఏమైనా సమస్యలు వస్తే 040–23328266 నెంబర్ లో (ఆఫీస్ సమయంలో) సంప్రదించాలని ఆయన తెలిపారు.