
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునసదనవద్ద నూతనంగా ప్రచురణల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.ఈ రోజు (15.07.2021) న ఉదయం కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు పూజాదికాలను జరిపించి విక్రయాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి దేవస్థానం ప్రచురించిన కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను, గో ఉత్పత్తులను తొలిగా కొనుగోలు చేశారు.
ప్రస్తుతం ఆలయ దక్షిణ మాడవీధిలోని ప్రచురణల విక్రయ కేంద్రం ద్వారా దేవస్థానం ప్రచురణలు విక్రయిస్తున్నారు .కాగా ప్రస్తుతం మల్లికార్జునసదన్ వద్ద అదనంగా ఈ విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
ఈ విక్రయ కేంద్రంలో దేవస్థానం ప్రచురించిన ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక ప్రవచనాల డీవిడీలు, దేవస్థానం ముద్రించిన వివిధ రకాల క్యాలెండర్లు, శ్రీశైలప్రభ మాసపత్రిక, కైలాస కంకణాలు మొదలైనవి విక్రయిస్తారు.వీటితో పాటు దివ్యపరిమళవిభూతి, శ్రీచక్రార్చన కుంకుమ, హోమపిడకలు, గోమయంతో తయారు చేసిన ధూపిస్టిక్స్, గో అర్క్,
గోమయంతో చేసిన ప్రమిదలు, దంతమంజన్ (పళ్ళపాడి) మొదలైన గోఉత్పత్తులు కూడా ఈ విక్రయ కేంద్రం ద్వారా విక్రయిస్తారు.
అదేవిధంగా భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లకు సమర్పించిన వస్త్రములు, శేషవస్త్రాలు కూడా ఈ విక్రయకేంద్రం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
భక్తులు ఈ విక్రయ కేంద్రములోనే శ్రీశైలప్రభ వార్షిక, శాశ్వత చందాలను కూడా నమోదు చేసుకోవచ్చు.
విక్రయాల ప్రారంభకార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం. హరిదాసు, పి.నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీరు సుబ్బారెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, శ్రీమతి గిరిజామణి తదితరులు పాల్గొన్నారు.