హైదరాబాద్: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా వచ్చేలా నామినేట్ ఆయిన సందర్భంగా, అందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు , రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కు చెందిన ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్స్ సమస్యలపై చర్చించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, పరిశ్రమల శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న TSiPass లో టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవటానికి విధించిన 5000 రూపాయల ఫీజు ను మినహాయించి, అందుకు 500 రూపాయల నామమాత్రపు రుసుము కు తగ్గించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వినతిపత్రం ను సమర్పించారు. ప్రస్తుతo కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలయిందన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ ఎంతో నష్టపోయారని మంత్రి కి వివరించారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం లో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ కు ప్రభుత్వ సహకారంతో బ్యాంక్ ల నుండి ఉద్దీపన పథకాలను అమలు చేయాలని మంత్రి ని కోరారు. 4500 మంది తెలంగాణ రాష్ట్రం లో టూర్స్ అండ్ ట్రావెల్ ఎజెంట్స్ వల్ల అనేక మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కి వివరించారు. టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించటానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కు చెందిన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ , అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.