
కర్నూలు: మనబడి నాడు నేడు మొదటి దశ పనులు ఈనెల 10వతేదీకి ముగించాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. మనబడి నాడు నేడు మొదటి దశ పనులపై జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజక్ట్ కోఆర్డినేటర్ , ఉపవిద్యాధికారులు, సెక్టోరల్ ఆఫీసర్స్ , అన్ని విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ (VWS & D) 5/7/21 న మధ్యాహ్నం రివ్యూ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ధికి నాడు నేడు కార్యక్రమం దోహదపడుతోందని ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దబడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం మొదటి దశలో ఎంపికైన పాఠశాలల పనులు చివరిదశకు చేరుకున్నందున వాటిని త్వరగా పూర్తిచేసి ఈనెల 10వతేదీకి అన్ని ప్రాజక్ట్ లు క్లోజ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెయింటింగ్ మరియు వాల్ ఆర్ట్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నవాటిని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. నాడు నేడు పనులు, పాఠశాలల అభివృద్ధి విషయంలో మన జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.జాయింట్ కలెక్టర్ మనజీర్ జిలానీ మాట్లాడుతూ 1044 ప్రాజక్ట్స్ కు గానూ ఇప్పటిదాకా 650 ప్రాజక్ట్స్ క్లోజ్ అయ్యాయని, మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో జిల్లావిద్యాశాఖాధికారి సాయిరామ్ , సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజక్ట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ , పంచాయతీరాజ్ యస్ ఇ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.