‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో 25 లక్షల మొక్కలతో హైదరాబాద్ రికార్డు25 లక్షల మొక్కలతో హైదరాబాద్ ఓ రికార్డుగా నిలవనుంది.
‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి రంగం సిద్దమైంది. హైదరాబాద్ నగరంలో కూడా చాలా అటవీ భూములు, పార్కులు, చెరువులున్నాయి. వాటిలో మొక్కలు పెంచడంతో పాటు జనావాస ప్రాంతాల్లో ప్రతీ ఇంటిలో, ప్రతీ పార్కులో చెట్లు పెంచడానికి ఏర్పాట్లు జరిగాయి. ఐదేళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో 7 కోట్లు, జిహెచ్ఎంసి పరిధిలో 3 కోట్లు మొత్తం పది కోట్ల మొక్కలు పెంచాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఈ సారి ఒకే రోజు జూలై 11న 25లక్షల మొక్కలు నాటుతారు. ఇందుకోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, అటవీశాఖ, పరిశ్రమల శాఖ, ఐటి శాఖ, ఉద్యానవన శాఖ, పోలీస్ శాఖ తదతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా కార్యచరణ రూపొందించాయి. హైదరాబాద్ కు కావాల్సిన మొక్కలు సరఫరా చేయడం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 100 నర్సరీలున్నాయి. ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటడం కూడా ఓ రికార్డుగా నిలవనుంది.