శ్రీశైల దేవస్థానంలో దత్తాత్రేయస్వామివారికి విశేషార్చనలు

*

 శ్రీశైల దేవస్థానం:  శ్రీశైల దేవస్థానంలో   లోకకల్యాణం కోసం  ఈ రోజు (27.05.2021) న  ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు.

ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం చేస్తున్నారు.

ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేసారు.

లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.

 అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ దత్తాత్రేయస్వామివారికి ఈ విశేషార్చనలు నిర్వహించారు.

*  S. Srinivasa Vara Prasad Rao, Kavali, Nellore Dt, A.P. donated RS.One Lakh For Gosamrakshana Nidhi.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.