*జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్అండ్ బి ఇంజనీర్ అధికారులను ఆదేశించిన జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి :
కర్నూలు, మే 26 :-కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిజిహెచ్ లో నిర్మిస్తున్న జెర్మన్ హ్యా0గర్లు తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం పనులను వెంటనే పూర్తిచేయాలని ఆర్అండ్ బి ఎస్ ఈకి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
బుధవారం సాయంత్రం స్థానిక జెసి (రెవెన్యూ), జిల్లా ఇంఛార్జి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి అదనపు బెడ్స్ జెర్మన్ హ్యా0గర్లు తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం పై జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ జెర్మన్ హ్యా0గర్లు తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం పనులను శనివారం లోపు పూర్తి చేసి అప్పగించాలని ఆర్అండ్ బి అధికారులకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. తక్కువ సమయంలో పనులు మొదలు పెట్టి చాలా ఫాస్ట్ గా చేశారని ఆర్ అండ్ బి ఇంజనీర్ అధికారులను జిల్లా ఇంచార్జి కలెక్టర్ అభినందించారు. చెక్ లిస్ట్ ప్రకారం అన్ని రకాల సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్, మ్యాన్‌పవర్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.