
- కర్నూలు, మే 18 :కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జర్మనీ షెడ్స్ ఆసుపత్రి నిర్మించే నిర్వాహకులకు అడగగా…వచ్చే గురువారం లోగా పనులన్నీ పూర్తి చేసి అప్పగిస్తామని వారు వివరించారు.జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, చీఫ్ మెడికో ఆరోగ్యశ్రీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఇలియాస్ భాష, ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరాం రెడ్డి, ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఈ రోజు మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో కరోన బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధం చేసిన వంద ఆక్సిజన్ పడకలను జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీలు పరిశీలించారు.తదనంతరం మధ్యాహ్నం కర్నూలు నగర శివారులోని టిడ్కో హొసింగ్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్ లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు అదనపు బెడ్స్ అన్ని రకాల సౌకర్యాలతో జెర్మన్ షెడ్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పరిశీలించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు టిడ్కో హౌసింగ్ కాలనీలో జర్మన్ హేంగర్ల ద్వారా తాత్కాలిక షెడ్లు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి వారంలోగా పనులు పూర్తిచేయాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించిన జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి చెప్పారు.ఆర్ అండ్ బి ఇంజనీర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టండి:
కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా జిల్లాలో ఫీవర్ సర్వేను పక్కాగా చేపట్టాలని సర్వేలైన్ అధికారులును జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఫీవర్ సర్వే పై సర్వేలైన్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బందితో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిస్ట్రిక్ట్ సర్వే లైన్ ఆఫీసర్ రామాంజనేయులు, డిఆర్డీఏ ఏపీడి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో ఎటువంటి తప్పులకు తావివ్వకుండా సమగ్రమైన సమాచారం రాబట్టాలన్నారు. జ్వరాలపై ఇంటింటి సర్వేలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తించాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే సంబంధించిన ఏఎన్ఎం టెస్టులు చేయాలన్నారు. అంతేకాకుండా వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లోనూ అప్లోడ్ చేయాలన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని అవసరాన్ని బట్టి కోవిడ్ కేర్ సెంటర్లో గానీ, ఆస్పత్రిలో గానీ చేర్పించాలి అన్నారు. లక్షణాలు లేక పాజిటివ్ నమోదైన కరోన బాధితులకు వారికి అవసరమైన మందుల కిట్ ఇచ్చి ఏఎన్ఎం పర్యవేక్షణ చేసేలా చూడాలి అన్నారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే టెస్టులు చేసి వారికి మందులు, కరోనా కిట్లు అందచేయాలని సూచించారు.