కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ట్రయల్ రన్

కర్నూలు, మే 17 :-కర్నూలు జిజిహెచ్ పి.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ ను వారం రోజుల పాటు కొనసాగించి.. లోటుపాట్లను గమనించిన అనంతరం పి.ఎస్.ఏ. ఆక్సీజన్ ప్లాంట్ ను ప్రారంభిస్తామని  ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ట్రయల్ రన్ ను ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ప్రారంభించారు.

ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ లో వన్ కిలో లీటర్…వెయ్యి లీటర్ల కెపాసిటీ… ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ జనరేట్ చేస్తుందన్నారు. పి.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ చేశామని…మెయిన్ లైన్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది…బాగా ఫంక్షన్ లో ఉందన్నారు. ఇటువంటి ప్లాంట్ సోనా సూద్ కూడా ఇస్తామన్నారు. ఇటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే…. ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. కర్నూలు జిజిహెచ్ లో దాదాపు వెయ్యి మంది పేషెంట్స్ ఇప్పటికే ట్రీట్మెంట్ పొందుతున్నారు. కర్నూలు జిజిహెచ్ లో రాయలసీమ నాలుగు జిల్లాలు…తెలంగాణ, బళ్లారి జిల్లాల చాలామంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోన బాధితులకు ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ఆక్సిజన్ వార్ రూమ్ ద్వారా అనునిత్యం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా దాతలు ఇలాంటి ప్లాంట్ లు వన్ కే ఎల్… ఆఫ్ కే ఎల్ ప్లాంట్ లు పెట్టడానికి సిద్ధంగా ఉంటే అన్ని వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోనా సూద్ గారు జీజీహెచ్ లోనే వన్ కే ఎల్ ప్లాంట్ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు.

పీ.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ లో పాల్గొన్న జేసీ (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ చీఫ్ మెడికో డాక్టర్ ఇలియాస్, ఏఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.