
తిరుపతి, 2021 మార్చి 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు, పార్కింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయం పరిసరాలలోని రోడ్లను జెఈవో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
జెఈవో ఘంటశాల విగ్రహం వద్ద రోడ్డు వెడల్పు చేయడానికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతి కార్యాలయం వద్ద పార్కింగ్ స్థలం పరిశీలించి పలు సూచనలు చేశారు. పూడి రోడ్డు – తోళప్ప గార్డెన్ – నేషనల్ హైవేను కలిపే రోడ్డును వెడల్పు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బయటకు వచ్చే మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
జెఈవో వెంట సిఇ రమేష్ రెడ్డి, ఎస్ ఇ సత్యనారాయణ, ఇఇ నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.