శ్రీశైల దేవస్థానం : శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మొదటి రోజు సాయంకాలం అంకురార్పణ ఎంతో విశేషంగా జరిగింది.. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. దీనినే ” మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభించారు. ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించారు . పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అంకారాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ :
బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సాయంకాలం ధ్వజారోహణ ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత వుంది. ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ఈ ధ్వజారోహణ.
ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని చిత్రీకరించారు. దీనికే నంది ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన ప్రత్యేక తాడును ఉపయోగించారు. తరువాత నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలు జరిపారు. ఈ కార్యక్రమం లోనే భేరీ పూజ కూడా నిర్వహించారు. ఈ ఓ – కే ఎస్.రామ రావు పాల్గొన్నారు.
ఈ భేరీ పూజలో డోలు వాద్యానికి పూజదికాలు జరిపారు. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ధ్వజస్తంభం మీద ఈ నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి, రోజూ పద్ధతి ప్రకారంగా వారికి నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయం లో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ క్షేత్రాన్ని తిలకిస్తారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.
-Highlights in cultural programmes:
* Kuchipudi Programme at Pushkarini, Andhranatyam Programme at Nitya Kalaradhana Stage, Kuchipudi Programme At Siva Deeksha Shibiram Stage, Harikatha Programme At Nithya Kalaradhana Stage, Bhaktha Markandeya Programme At Siva Deeksha Shibiram – Stage*
* M.S.N. Raju, M. Janakiram ,Hyderabad donated Medicine Worth Of Six lakhs In Devasthanam Hospital *
* Smt M. Sarojamma and Family, Mysore, Karnataka State donated Rs.1,10,000 For Annadhaanam scheme.