శ్రీశైల దేవస్థానం: ఘంటామఠ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. దేవస్థానం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా ఈ రోజు 27 న కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించారు.ఇందులో భాగంగా ముందుగా ఘంటామఠం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఘంటామఠ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. తరువాత పాతాళగంగమార్గములోని డార్మెటరీలను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం డార్మెటరీలలో మరిన్ని సౌకర్యాలను కల్పించాలని వసతివిభాగం అధికారిని ఆదేశించారు.ముఖ్యంగా డార్మెటరీల వద్ద మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం టూరిస్ట్ బస్టాండ్ వద్ద అమినీటిస్ డార్మెంటరీలను కూడా పరిశీలించారు.తరువాత సిద్ధరామప్ప వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ట్ శుచి శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పారిశుద్ధ్యవిభాగాన్ని ఆదేశించారు. షాపింగ్ కాంప్లెక్స్ పై భాగంలో ఉన్న గదులను డార్మెటరీలుగా మార్పు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తరువాత భ్రామరీసదనములో దేవస్థాన రికార్డురూమును పరిశీలించారు. రికార్డు రూమును మరింతగా విస్తరింపజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రికార్డురూములోని దస్తాలన్నింటినీ సంవత్సరాల వారిగా, విభాగాలవారిగా క్రమపద్ధతిలో అమర్చాలని రికార్డురూము సిబ్బందిని ఆదేశించారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి డి. మల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహరెడ్డి, వసతివిభాగం పర్యవేక్షకులు స్వాములు, రెవిన్యూ విభాగం పర్యవేక్షకులు శివప్రసాద్, సహాయ స్థపతి ఐ. జవహర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.