శ్రీశైల దేవస్థానంలో ఘనంగా అయిదో రోజు ఉత్సవాలు
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో రోజు 21 న ఉదయం ప్రాత:కాలపూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారాలు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానాలు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణాలు, కుమారీ పూజలు జరిగాయి. శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణ లు జరిగాయి. ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.ఈ రోజు రాత్రి కాళరాత్రిపూజ, మంత్రపుష్పం, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరిగాయి.
Post Comment