శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ రోజు శిఖరేశ్వర ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావ్, స్థానిక సీఐతో కలిసి శిఖరేశ్వరం ఆలయం వద్ద భద్రతా చర్యలను పరిశీలించారు.కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive) పథకంక్రింద శిఖరేశ్వర ఆలయం వద్ద పుష్కరిణి జీర్ణోద్ధరణ, యాత్రికుల సౌకర్య కేంద్ర నిర్మాణం ( pilgrims amenities center ) ర్యాంప్ నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ఆలయంలో రాతి బండపరుపు, వాచ్ టవర్ నిర్మాణం మొదలైన పనులు చేసారు.
ప్రస్తుతం నూతన క్యూలైన్ల ఏర్పాటు, ఆరు అంతస్తులుగా నిర్మించిన వాచ్ టవర్ లోని ప్రతి అంతస్తులోనూ ఎనిమిదివైపులా కూడా సేప్టిల్స్ ఏర్పాటు, వాటవర్ పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సుందరీకరణలో భాగంగా వాచ్ టవర్ పై అంతస్తులో తగు విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శిఖరేశ్వర ఆలయం వద్ద గతంలో నెలకొల్పిన విద్యుత్ శివలింగానికి అవసరమైన మరమ్మతులు చేసి, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు వీలుగా శిఖరేశ్వర ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని కూడా కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
శిఖరేశ్వర ఆలయం వద్ద అవసరం మేరకు మరిన్ని మార్గ సూచికలను (ఫ్లెక్సి బోర్డులను ) ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.