శ్రీశైల దేవస్థానం: ఘంటామఠం పునరుద్ధణ పనులలో ధ్యానమందిరం బయటపదింది. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.కాగా ఈ రోజు 24న ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా ధ్యానమందిరం బయటపడింది.విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి ఘంటామఠం చేరుకుని ధ్యానమందిరాన్ని పరిశీలించారు.ఘంటామఠం ఆలయం ముందుభాగములోని కోనేరుకు ఉత్తరభాగాన ఈ ధ్యానమందిరం బయపడింది.ఈ ధ్యాన మందిరం సుమారు 6 అడుగుల 6 ఇంచుల విస్తీర్ణణాన్ని కలిగిఉంది. ధ్యానమందిరం నైరుతి భాగం నుండి ఆగ్నేయం వరకు, ఆగ్నేయ మార్గం నుండి తూర్పు వరకు సొరంగ మార్గం ఉంది.ఈ ధ్యానమందిరాన్ని యథావిథిగా పునరుద్ధరణ పనులు చేస్తారు.
ఈ కార్యక్రమములో ఈఈ మురళీ బాలకృష్ణ, పర్యవేక్షకులు శ్రీహరి, సహాయ స్థపతి ఐ.యు.వి జవహర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.