కోవిడ్ నివారణ నిబంధనల అమలులో రాజీపడకూడదు-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనాలకు అనుమతిస్తున్నారు.  ప్రస్తుతం ఆర్జిత సేవలు కూడా పునఃప్రారంభించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆర్జితసేవలు జరుప్తున్నారు .

ఆర్జిత ప్రత్యక్షసేవలను ప్రారంభించినప్పటికీ, ఆర్జిత పరోక్షసేవలు కూడా యథాతథంగా కొనసాగుతాయి.

కాగా ఈరోజు (24.08.2020) ఆర్జిత సేవలుగా మొత్తం 22 మంది సామూహిక రుద్రాభిషేకాలను, 14 మంది కుంకుమార్చనలను, ఇద్దరు చండీహోమాన్ని,  నలుగురు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని జరిపించుకున్నారు. మొత్తం ఈ రోజు 42 ఆర్జిత సేవలను  జరిపారు. ఆర్జిత సేవాకర్తలకు కూడా శ్రీస్వామి అమ్మవార్ల దూరదర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.

ప్రస్తుతం అక్కమహాదేవి అలంకారమండపములో స్వామివారి సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయప్రాంగణములోని ఆశీర్వచనమండపములో కుంకుమార్చనలు, సాక్షిగణపతి ఆలయం వద్ద గణపతిహోమం, ఆలయప్రాంగణములోని అమ్మవారి యాగశాలలో చండీహోమం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం మొదలైన ఆరు ఆర్జిత సేవలను మాత్రమే జరుఫుతున్నారు.అదేవిధంగా గణపతినవరాత్రోత్సవాలు ముగిసిన తరువాత  సెప్టెంబరు 1వ తేదీ నుండి రుద్రహోమం, మృత్యుంజయహోమాలను కూడా ఆర్జిత సేవలుగా పున:ప్రారంబిస్తారు.

భక్తులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా సేవాటికెట్లను పొందవచ్చు. అదేవిధంగా క్యూకాంప్లెక్స్ ఎదురుగా గల ఆర్జితసేవా కౌంటరు నుండి కూడా భక్తులు సేవాటికెట్లను పొందవచ్చు.

ఆన్ లైనులో ,  కరెంట్ బుకింగు లో  పరిమిత సంఖ్యలో మాత్రమే ఆర్జిత సేవాటికెట్లు ఇస్తారు.

టైమ్ స్లాట్ పద్దతిలో అనగా దర్శనాలకు,  ఆర్జిత సేవలకు దేవస్థానం ముందస్తుగా కేటాయించిన నిర్ణీత సమయాలలో మాత్రమే భక్తులను అనుమతీస్తారు.

క్యూలైన్ల, ఆర్జితసేవా కౌంటర్ల పరిశీలన :

కాగా ఈ రోజు 24న  కార్యనిర్వహణాధికారిసంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లను, ఆర్జితసేవా కౌంటర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దర్శనాలకు విచ్చేసే భక్తులను,  ఆర్జిత సేవాకర్తలను ఆలయములోనికి అనుమతించేటప్పుపుడు కోవిడ్ నివారణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.ఈ విషయమై ఏవిధంగా కూడా రాజీపడకూడదన్నారు. సామూహిక అభిషేకాలు నిర్వహించే అలంకారమండపం,  కుంకుమార్చన నిర్వహించే ఆశీర్వచనమండపం, కల్యాణాన్ని జరిపే కల్యాణమండపం, యాగశాలలు, సాక్షిగణపతి ఆలయము మొదలైన వాటిని ఎప్పటికప్పుడు  ఆర్జిత సేవలు ప్రారంభించే ముందు,  ఆర్జిత సేవలు పూర్తి అయిన తరువాత హైపో క్లోరైడ్ ద్రావణముతో శుభ్రం చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరాన్ని పాటించడంలాంటి నియమాలను విధిగా ఆచరించేలాగా చర్యలు చేపట్టాలన్నారు.ఆర్జితసేవలను నిర్వహించేటప్పుడు కూడా సేవాకర్తలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దర్శనప్రవేశంద్వారం వద్ద,  ఆర్జిత సేవల ప్రవేశద్వారం వద్ద థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా పరీక్షించాలన్నారు.

ఈ విషయమై ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం సూచనలు చేస్తూ , భక్తులకు అవగాహనను పెంపొందించాలన్నారు.

ఆర్జిత టికెట్టు కౌంటర్లు, క్యూలైన్ల ప్రవేశద్వారాలు, క్యూలైన్లు, ఆర్జిత సేవలు జరిపించే స్థలాలు మొదలైన చోట్ల కోవిడ్ నివారణ చర్యల గురించి భక్తులకు అవగాహన కల్పించే విధంగా మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం – .

లోకకల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజుఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించారు.

ప్రతి మంగళవారం,  కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం,  పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తారు.

print

Post Comment

You May Have Missed