శ్రీశైల దేవస్థానం: ప్రసాద విక్రయ కేంద్రములో ఈరోజు 12 నుంచి పులిహోర ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుగా తిరిగి అందుబాటులో ఉంచారు.లాక్ డౌన్ సమయములో భక్తులకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేశారు.దాంతో ప్రసాదవిక్రయాలు కూడా నిలుపుదల చేసారు.దర్శనాలు ప్రారంభించిన తరువాత ముందుగా లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచారు.కాగా ఈ రోజు నుంచి పులిహోర ప్రసాదవిక్రయం కూడా తిరిగి ప్రారంభమైంది.రేపటి నుంచి పులిహోర ప్రసాదముతో పాటు పెరుగన్నప్రసాదాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది.150 గ్రాముల పులిహోర ప్రసాదాన్ని భక్తులు రూ. 10/-లకు కొనుగోలు చేయవచ్చు. 150 గ్రాముల పెరుగన్న ప్రసాదాన్ని కూడా రూ. 10/-లకు కొనుగోలు చేయవచ్చు. భక్తుల కోరిక మేరకు వీటిని విక్రయానికి అందుబాటులో ఉంటుంద.
ప్రస్తుతం అన్నప్రసాద వితరణలేని కారణంగా భక్తులందరికీ పులిహోర, పెరుగన్నం పొట్లాలను ” అందిస్తున్నారు. ఆలయ పశ్చిమమాడవీధిలో ( అమ్మవారి ఆలయం వెనుక) ఈ ప్రసాదాలు ఇస్తారు. .