అనంతపురం: ఖరీఫ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శంకర్‌నారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలో 8 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.ఈ-క్రాపింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలు అందజేస్తున్నారు.ఖరీఫ్ పంటకు 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సచివాలయాల్లో సిద్ధంగా ఉంచారు.
మంత్రి శంకర్‌నారాయణ మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి అని కొనియాడారు. గ్రామస్థాయిలో విత్తనాల పంపిణీ చారిత్రాత్మకమన్నారు. రైతులకు 40 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.