శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధనలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
దేవస్థానము నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (10.03.2020) శ్రీ నటరాజ నృత్యకళానికేతన్, తెనాలి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ కూచిపూడి ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశ పంచరత్నం, శివాష్టకం, శివోహం, శంకరశ్రీగిరి, మూషికవాహన, శివపాదమంజీరనాదం, ఓంకారం, ఓం నమఃశివాయ తదితర గీతాలకు వైష్ణవి, భవాని, పావని, వల్లీ వైష్ణవి, బృంద, కీర్తన, మనోజ్ఞ, హాసిని, జయ మాధురి, జోషిక, మోక్షజ్ఞ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. ఈ నృత్య ప్రదర్శనలో శిక్షకురాలు శ్రీమతి ఓం కారేశ్వరి మరియు తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.