శ్రీశైల దేవస్థానంలో అలరించిన భక్తి సంగీతవిభావరి “నిత్యకళారాధన” (నివేదన)
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన దేవస్థానము నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (09.03.2020) శ్రీ వనపర్తి సత్యం స్వామి, వనపర్తి జిల్లా వారిచే భక్తి రంజని కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భక్తి సంగీతవిభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో జయ జయ వినాయకే, శివుడే దేవుడని నేను అంటే, శివ శివ శంకర, ఓం హరశంకర, శ్రీశైలం శివమయం, ఓం నమ:శివాయ, ఈశా గిరిశా మహేశా, అంతయూ మీదే, శంభో శంకరా, మహేశా పాపవినాశా, జననీ శివకామినీ తదితర భక్తిగీతాలకు అనిత, శేఖర రెడ్డి, సుదర్శన్, జనకిరాములు, సత్యంస్వామి, నిఖిల్ తదితరులు ఆలాపించారు. కార్యక్రమములో సహకారవాయిద్యాలుగా తబల,
డోలక్, రిథమ్ ప్యాడ్స్ సహయారాన్ని ఆయా కళాకారులు అందించారు.
కాగా ఈ నిత్యకళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.