సీనియర్ సంపాదకులు, పాత్రికేయ కురువృద్ధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈనాడు ప్రారంభ దినాలలో ప్రారంభ సంపాదకుడిగా పనిచేసిన ఆయన, పలు ప్రధాన పత్రికల్లో సంపాదకులు గా పనిచేశారు. సీనియర్ సంపాదకుడిగా నిష్టాగరిష్ఠ మైన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. తెలుగు పత్రిక లను డిజిటైజేషన్ ను విజయవంతం చేశారని అన్నారు.రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌర స్పందన వేదిక బాధ్యులు గా శాంతి స్థాపనలోప్రధాన పాత్ర పోషించారు .అనేక గ్రంథాల రచయితగాను,ఆంధ్ర ప్రదేశ్ పత్రికారంగ చరిత్ర ను గ్రంధస్తం చేశారని అన్నారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అల్లం నారాయణ సానుభూతిని తెలిపారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు పార్థీవ దేహానికి ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ తాను పొత్తూరు వద్దనే జర్నలిజంను కెరియర్ గా ఎంచుకున్నానని తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, పొత్తూరు మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని అన్నారు. వీరివెంట టీయూడబ్ల్యూజె కార్యదర్శి మారుతి సాగర్, జాయింట్ సెక్రటరీ వర్దెల్లి వెంకటేశ్వర్లు, సిటీ ప్రెసిడెంట్ యోగానంద్, తదితరులు పాల్గొన్నారు.