శ్రీశైలంలో ఈ రోజు ఘనంగా గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా , చక్కని ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. సాక్షి గణపతి ఆలయంలో , యాగశాలలో స్వామి వారలకు విశేష పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ముందుగా అర్చక స్వాములు సంకల్పం చెప్పారు.మృత్తికా గణపతి స్వామి వారికి పాలవెల్లి ఏర్పాటు చేసారు. సాక్షి గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం. విశేష అర్చనలు చేసారు.ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా యాగశాలలో ఈ ఉత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు.పంచలోహ గణపతి మూర్తి కి విశేష పూజ జరిపారు. ప్రతిరోజు విశేష పూజలతో పాటు, చివరి రోజున మరిన్ని సంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయని దేవస్థానం ఎడిటర్ తెలిపారు.