అమరావతిః గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, టీడీపీ నాయకుల స్వార్థ విధానాలతో వీధికో బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ధ్వజమెత్తారు. మద్యంతో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని మద్యం షాపులు ఉండకూడదని మహిళలందరూ కోరుకుంటున్నారని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపులు.. గుడి,బడి తేడా లేకుండా రాష్ట్రమంతట వీధికి రెండు,మూడు విస్తరించాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెల్టుషాపులు పూర్తిస్థాయిలో రద్దు చేయడం పట్ల మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
మహిళల కన్నీళ్లు తుడిచి వారి ముఖంలో సంతోషం నింపడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలందరూ ఆరోగ్యం ఉండాలని, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండి దేశానికి భావిభారత పౌరులుగా ఎదగాలనే ఉద్దేశ్యంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు పౌష్ఠికాహారం అందించే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళలకు రక్షణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళా కమిషన్,మహిళా సహకార ఆర్థిక సంస్థ,బాలల న్యాయ సంస్థ,మహిళల సాధికారిత వంటి సంస్థల ద్వారా మహిళాలకు మేలు జరిగే చర్యలు చేపడుతున్నామన్నారు. ఏపీ మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ కిశోర్ వికాస పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 900 రెసిడెన్షియల్ పాఠశాలలో 2 లక్షల కిశోర్ బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.