విజయవాడ: శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. విశాఖలోని శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రయంలో ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారలకు ఇరువురు సీఎంలు వైయస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు.