శ్రీశైల బ్రహ్మోత్సవాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బుధవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి  జరిగింది.ఉదయం శ్రీ స్వామి అమ్మ వారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం శ్రీ స్వామి వారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామి  వారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. రుద్ర హోమం , జయాది హోమం జరిపారు. రుద్ర హోమ పూర్ణాహుతి , వసంతోత్సవం, అవబృధం, త్రిశూల స్నానం నిర్వహించారు.

పూర్ణాహుతి లో  శాస్త్రోక్తంగా రుద్రయాగం పూర్తి చేసారు. వసంతోత్సవం లో అర్చక స్వాములు, వేద పండితులు  వసంతాన్ని సమంత్రకంగా  భక్తులపై ప్రోక్షించారు.అవబృధం లో  శ్రీ చండీశ్వర స్వామి  వారికి ఆలయ ప్రాంగణంలో ని మల్లికా గుండంలో ఆగమ శాస్త్రోక్తంగా స్నానాదిక కార్యక్రమాలు జరిపారు. అనంతరం త్రిశూల స్నాన  కార్యక్రమం జరిపారు.

print

Post Comment

You May Have Missed