తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల భద్రత ఏర్పాట్లపై సమావేశం
ఈనెల 22 తేదీ నుండి జరగనున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల భద్రత ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.
స్పీకర్ చాంబర్ లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహ చార్యులు, SPF డిజి తేజ్ దీప్ కౌర్, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…శాసనసభ సమావేశాలు ఈనెల 22 నుండి 25 వరకు జరుగుతాయి. మొత్తం 3 రోజులు శాసనసభ సమావేశం ఉంటుంది. అందరి సహకారంతో శాసనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నది. సహకరించిన అందరికీ అభినందనలు. గతంలో మాదిరిగా అందరి సహకారం కొనసాగాలి. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు శాఖది కీలక బాధ్యత. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు.
శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ మాట్లాడుతూ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో సమావేశం జరపడం ఆనవాయితి. సమావేశాలు శాంతియుతంగా జరపడానికి అందరి సహకారం అవసరమన్నారు .
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుండి అందిస్తామన్నారు.
Post Comment