వనస్థలిపురం కమలానగర్ రామాలయంలో ఘనంగా ఆళ్వార్ల ప్రతిష్ఠ జరిగింది. ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ శ్రీవైష్ణవ సంప్రదాయ కార్యక్రమం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వేంచేసిన రుత్వికులు కార్యక్రమాన్ని వివిధ పూజాదికాలతో జరిపారు. చివరిరోజు శ్రీ సీతారామ కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు. ఆలయంతో చాలా కాలంగా అనుబంధం ఉన్న వారు తమ అనుభవాలను వివరించారు.బ్రహ్మోత్సవాల్లో భక్తి సంగీత కార్యక్రమాలు జరిగాయి. శనివారం సాయంత్రం అమ్మవారు పెరుమాళ్ళ ఉరేగింపు భక్తుల కోలాటాల మధ్య జరిగింది.