తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం కేసీఆర్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు మహముద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మహముద్ అలీకి హోం శాఖ కేటాయించారు.