శ్రీశైల దేవస్థానానికి బంగారు నాగాభరణం విరాళంగా అందింది.విజయవాడ వాస్తవ్యులు , శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డా.బొప్పన ఝాన్సీలక్ష్మీబాయి శ్రీశైల శ్రీస్వామి వారికి బంగారు నాగాభరణాన్నివిరాళంగా సమర్పించారు. గో సంరక్షణ కోసం వరంగల్ వాస్తవ్యులు ఎస్.శాంతాదేవి రూ. 1,00,000 విరాళం అందించారు. శనివారం వివిధ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.