– గుర్రాలగొంది ప్రజల అభిమానంతో భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్ రావు
*ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం దొరకదు.
– గతంలోనూ పెండ్లిలకు కట్నం చదివించినట్లు రాజీనామా చేసి వచ్చిన నాకు నోట్లు ఇచ్చారు, ఓట్లు వేశారు.
– రైతు బంధు పథకం రైతులకు ఆసరాగా నిలుస్తొంది.
– కాళేశ్వరం ప్రాజెక్టు 90 శాతం పూర్తయింది.
– ప్రాజెక్టు పూర్తయితే కాలం అయినా కాకున్నా నీళ్ల బాధ ఉండదు.
– వచ్చే వానాకాలం నాటికి గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి.
– నాకు ఎంత పని ఉన్న చాలా సార్లు మీ గ్రామానికి వచ్చిన.
– అదే కాంగ్రెస్ వాళ్లు వస్తారా ? ఓట్ల కాలం వస్తే గుంపులుగా వస్తారు.. నోటికిచ్చిన వాగ్దానాలు చేసి పోతారు.
– కుర్చీ కోసం అన్ని పార్టీలు కలుస్తున్నాయి.
– మీరు గుంపుగా వచ్చినా మేం సింగిల్ గానే ఒడిస్తాం.
– కాంగ్రెస్ నాడు మోసం చేసింది.. మళ్లీ ఇప్పుడూ మోసం చేస్తున్నది.
— అధికారం కోసం చంద్రబాబు తో కాంగ్రెస్ కలుస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకు వారికి ఓటేయ్యాలా ?
– పార్టీ పెడితే దేశమంతా నా వైపు ఉంటారన్న కోదండరాం ఇప్పుడు రెండు, మూడు సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పొర్లు దండాలు పెడుతున్నాడు.
– కేసిఆర్ నీడలో ఎదిగిన కోదండరాం తనకు తాను గొప్పగా ఉహించుకున్నాడు.
– 50 సార్లు ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి, నేను తిరిగినా మా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా ?
– నిన్నటి దాఖా చంద్రబాబు తో కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు.
– రాత్రికి రాత్రి 7 మండలాలను ఆంధ్రలో కలపలేదా ?
– ఒక్క వేళా వారే గెలిస్తే మళ్ళీ ఢిల్లీకి గులాం గిరి తప్పదు.
– దేశానికే ఆదర్శవంతమైన పాలన ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్నారు.
– గుర్రాలగొంది ప్రజల అభిమానంతో భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్ రావు