కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం కర్నూలుకు చేరుకున్నారు.దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో రాహుల్ కలిసారు.పెదపాడులోని సంజీవయ్య ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంజీవయ్య ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. సంజీవయ్య ఇంటికి రాహుల్ తోపాటు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితర నేతలు వెళ్లారు.అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.