source:shd w.app group
వరంగల్: కొండా దంపతులను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించేందుకు అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా గులాబీ దళపతి కేసీఆర్ రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే గణపతి నవరాత్రులు ముగిసిన అనంతరం వాళ్లు నేరుగా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. చిన్నచిన్న కారణాలతో ఇక్కడే ఒకటి, రెండు సీట్లను కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. కొండా దంపతులు వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా, మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం. అప్రమత్తమైన కేసీఆర్ ఇప్పటికే కొండా మురళితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.మీ రాజకీయ భవిష్యత్‌ను తనకు వదిలేసి జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
file photos of konda surekha family and kcr