
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్ళ వ్యవధిలోఆకస్మిక మృతి చెందిన 220 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయుతనివ్వాలని, వేజ్ బోర్డు సిఫారసులను అమలు పరచి జర్నలిస్టులకు కనీస వేతనాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్దత కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయుడబ్ల్యుజె (ఐజేయు) ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందించింది. ఐజేయు నాయకులు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, మాజీద్, కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె నాయకులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, రాజేష్ గవర్నర్ ను కలిశారు