
– ఏర్పాట్లు పర్యవేక్షించిన నాయకులు
ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్దత, వెజ్ బోర్డు సిఫారసుల అమలు, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆకస్మిక మరణాల నిలుపుదల తదితర డిమాండ్లతో, సెప్టెంబర్ 4న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీయుడబ్ల్యుజె(ఐజేయూ) నిర్వహించతలపెట్టిన ధర్నాకు ఢిల్లీ పోలీసుల అనుమతి లభించింది. సోమవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయు కార్యదర్శి
వై.నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కల్లూరి సత్యనారాయణ, దాసరి కృష్ణ రెడ్డి, రాజేష్ తదితరులు ధర్నా చౌక్ ను సందర్శించి ధర్నా సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు ధర్నాను ప్రారంభించే దిశలో చర్యలు చేపట్టారు. జంతర్ మంతర్ సిగ్నల్ సమీపంలోని, పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డులో, ఎస్ బి ఐ బ్యాంకు ఎదురుగా ధర్నా స్థలాన్ని ఎంపిక చేయడమే కాకుండా, మంచి నీళ్ళు, షామియానాలు, స్టేజి తదితర ఏర్పాట్ల కోసం పర్యవేక్షించారు.