
దేశ చరిత్రలో పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూము ఇళ్ల కార్యక్రమం చరిత్ర సృష్టిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇ ళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందన్నారు.సుమారు 9.65 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో కొల్లూరులో మొత్తం గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
కొల్లూరులో జిహెచ్ఎంసి తన సొంత నిధులతో సుమారు 124 ఎకరాలను సేకరించి పేదవారికి రెండు పడక గదుల ఇల్లు నిర్మించి అందించాలని సంకల్పించింది అని మంత్రి తెలిపారు.ఇక్కడ నిర్మిస్తున్న 15660 డబల్ బెడ్ రూమ్ ల మూలంగా కొల్లూరు ప్రాంతం ఒక పట్టణంగా మారుతుంద ని చెప్పారు .