బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, మండలినేత ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళా మోర్చా కార్యకర్తలు, నేతలు నాయకులకు రాఖీలు కట్టారు. మస్లిం మహిళలు సైతం ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా నాయకులు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు