కొత్తగా ఏర్పడ్డ గ్రామపంచాయతీలలో గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. గొల్లపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మె ల్యే ప్రారంభించారు. చంటయ్య పెళ్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆవరణలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు. రసూల్ పల్లిలో మహిళలు కోలాటం ఆడుతూ ఘన స్వాగతం పలికారు. యువకులు బాణసంచా కాల్చారు. రసూల్ పల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వీర్ల గడ్డ తండా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.గుంటూరు పల్లెలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. గుంటూరు పల్లి నూతన గ్రామపంచాయతీ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో టెంకాయ కొట్టి పూజలు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన క్షేత్రస్థాయి జీవ కారకముల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. హరితహారం లో భాగంగా గ్రామ పంచాయతీ భవనం ముందు మొక్కలు నాటారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గుంటూరు పల్లి గ్రామం రామరాజ్యంగా అభివృద్ధి చెందాలని శ్రీరాముని ప్రార్ధించానని చెప్పారు. అన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరేపల్లి, ఇందిరా నగర్ గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించి మొక్కలు నాటారు.
ఆంజనేయస్వామి దేవాలయం, బీరన్న గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్లు నాయక్ తండా నూతన గ్రామపంచాయతీ భవన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వంగ రామయ్య పల్లె గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ధర్మసాగర్ పల్లి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు బలోపేతం కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని చెప్పారు. చిగురుమామిడి మండలంలో గునుకులపల్లె నూతన గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే ప్రారంభించారు .వే-సైదాపూర్ మండలం రాయికల్ తండా నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.