గురుపౌర్ణమి న శ్రీశైలం దేవస్థానం పరిధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం ఉదయం హేమారెడ్డి మల్లమ్మ మందిం వద్ద శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి , వ్యాస మహర్షికి విశేష పూజలు చేసారు . అనంతరం వేద పండితులు వేద పారాయణం చేసారు. అర్చకులు , వేద పండితులు ఆగమ విద్యార్థుల తో గురు వందనం చేయించారు. పరమేశ్వరుని గురు స్వరూపమైన దక్షిణామూర్తి ని, జ్ఞాన సంపదను అందించిన వ్యాస మహర్షిని గురువుగా భావించి పూజించడం , స్మరించడం మన సంప్రదాయం . ఈ పూజలలో పాల్గొన్న ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ, సనాతన ధర్మంలో గురు ప్రాముఖ్యతను వివరించారు. ఉపనిషత్తు లోని సత్యకామజాబాలి కథను వివరించారు .గురుశిష్య సంబంధాన్ని తెలిపారు.విద్యార్థులకు కలం ,నోట్ పుస్తకాలు అందించారు .