హుస్నాబాద్: ఉమ్మాపూర్ శివారు మహాసముద్రం గండి నిర్మాణంలో స్థానిక రైతులు భూమి కోల్పోయారు. వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద చెక్కులు వచ్చాయి.హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యేమాట్లాడుతూ హరితహారం కార్యక్రమం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ లో పర్యటించిన సందర్భంగా మహాసముద్రం గండి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అక్కడ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు రూపాయలు 6 లక్షల సహాయం అందిందని తెలిపారు. 19మంది రైతులు భూమి కోల్పోయారని వారికి రూపాయలు 2,22,75,000 చెక్కుల రూపంలో పంపిణీ చేశామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ సమీకృత భవన నిర్మాణం కోసం అదనంగా ఒక ఎకరం భూమి ఇవ్వడానికి మామునూరు సంపత్ ముందుకు వచ్చారని అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపిస్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పారు. సమీకృత భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సమీకృత భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు .హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర ఏసి టాకీస్ యజమాని వెంకటనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెంకటనారాయణను పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈనెల 12వ తేదీన పెట్టుగడి వెంకమ్మ మృతి చెందింది . హుస్నాబాద్ ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులు రాజయ్య తదితరులను పరామర్శించారు. ఈనెల 16వ తేదీన రావణ వేణి నరసయ్య పందిళ్ళ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నరసయ్య కుటుంబ సభ్యులను సతీష్ కుమార్ పరామర్శించారు. ఈనెల 18న మిల్లుకూరి వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను సతీష్ కుమార్ పరామర్శించి సంతాపం తెలిపారు.హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో పచ్చిమట్ల వెంకటయ్య ఈనెల 12వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు. వెంకటయ్య కుటుంబ సభ్యులను సతీష్ కుమార్ పరామర్శించారు.హుస్నాబాద్ పట్టణానికి చెందిన బూజు సదానందం అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. సదానందం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఈనెల 15వ తేదీన మేడబోయిన సారవ్వ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఎమ్మెల్యే సతీష్ కుమార్ నల్లమల్ల వాడ ప్రాంతానికి రావడంతో కాలనీలో చిన్నారులు సంతోషంతో ఎమ్మెల్యేతో చేతులు కలుపుతూ ఆనందం తో ఫోటోలు దిగారు. పోచమ్మ వాడలో సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన సతీష్ కుమార్ , ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పలు అభివృద్ధి పథకాలపై చర్చించారు . మండల పరిధిలోని సర్పంచులను ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.