గనుల శాఖలో మరింత పారదర్శకత, వేగం కోసం టెక్నాలజీ వినియోగం– మంత్రి కెటి రామారావు
- గనుల శాఖలో అన్ లైన్లో అనుమతుల ప్రక్రియ పొర్టల్ ను ప్రారంభించిన మంత్రి కెటి రామారావు
- దీంతో అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు
- దరఖాస్తుల సమర్పణతోపాటు తుది అనుమతుల వరకు అన్ని అన్ లైన్లోనే
- త్వరలో మరిన్ని టెక్నాలజీ అప్లికేషన్లు వాడుకోనున్న గనుల శాఖ
- ఇంటిగ్రెటెడ్ మైనింగ్ సర్వీలియన్స్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా దానితో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షణ
- లీజుకు ఇచ్చిన విస్తీర్ణాన్ని డిజిటలైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, డ్రోన్ల టెక్నాలజీ వినియోగం
- ఖనిజాలను రవాణా చేసే వాహానాలను రిజిస్టర్ చేసుకుని పర్యవేక్షించడం, జిపియస్, అర్ యప్ ఐడి ట్యాగింగ్ చేస్తామన్న మంత్రి
గనుల శాఖలో అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు గనుల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈరోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అదనంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ అన్ లైన్ విధానాల ద్వారా లైసెన్సుల పునరుద్దరణ ద్వారా ఖజానాకు అదాయం పెరుగుతుందన్నారు.