-
బీవీ,హైదరాబాద్*
పారిపోయే నిందితులను సైతం పట్టుకోవాల్సిన పోలీస్ ఎస్.ఐ. తానే లంచం తీసుకొని పారిపోతూ ఏసీబీ కి చిక్కిన ఉదంతం ఇది . చైతన్యపురి ఎస్ఐ ఈరోజి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికారని పోలీసులు తెలిపారు .( 363 , 354/D )మొదలగు సెక్షన్ల కింద కార్తీక్ అనే రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది పై పలు కేసులు నమోదు అయ్యాయి . ఈ కేసుల్లో చైతన్య పురి Si. ఈరోజి వేధిస్తున్నారని , వీటి నుంచి తప్పించాలని కార్తీక్ కోరారని తెలిపారు .ఫేవర్ కోసం 20 వేలు లంచం ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశారన్నారు . కీర్తీక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు . ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో లంచం డబ్బులు ఇవ్వడం , ఆ డబ్బులు తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్.ఐ. పారిపోతుండగా ఏసీబీ వారు వెంబడించి రెడ్ హ్యాండ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి “ఎస్ ఐ”ని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు .