సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు అనుమతి 

* సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు అనుమతి*
*మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ 3వ బ్యాచ్ 150 ఎంబిబిఎస్ సీట్లకు రెన్యూవల్*
*నిజామాబాద్ మెడికల్ కాలేజి 100 సీట్ల పునరుద్ధరణ*
*మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం*
*సీఎం కేసీఆర్ కి, ఎం సి ఐ కి కృతజ్ఞతలు తెలిపిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి*
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైన్ క్లియర్ చేసింది. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ 3వ బ్యాచ్ 150 ఎంబిబిఎస్ సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలోను 100 సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలు సీట్ల పెంపునకు అన్ని విధాలుగా దిశా నిర్దేశం చేసి, సహకరించిన సీఎం కేసీఆర్ కి, mci కి కూడా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 2018-19 ఏడాదికి 150 సీట్లతో సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు  10A of the IMC Act, 1956 చట్టం ప్రకారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. దీనితో కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇక లాంఛనం మాత్రమే. కాగా, 2018-19 ఏడాదికి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 3 వ బ్యాచ్ 150 సీట్లకు రెన్యూవల్ వచ్చింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ మెడికల్ కాలేజి 100 సీట్ల రెన్యూవల్ కి కూడా అనుమతి లభించింది.
*సీఎం కేసీఆర్ కి, ఎం సి ఐ కి కృతజ్ఞతలు : వైద్య మంత్రి లక్ష్మారెడ్డి*
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రావడానికి అవసరమైన దిశా నిర్దేశం చేసిన  సీఎం కేసీఆర్ కి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  మెడికల్ కాలేజీ అనుమతులు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం సహకారం మరవలేనిదన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనలో అవసరమైన భూ సేకరణ, ఇతర వసతుల విషయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిశ్ రావు చొరవ కూడా కీలకం అన్నారు. అనుమతులు ఇవ్వడానికి సహకరించిన mci కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సూర్యాపేట నల్గొండ మెడికల్ కాలేజీలని సాధిస్తామని మంత్రి భరోసా వ్యక్తం చేశారు.
print

Post Comment

You May Have Missed