తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు సోమవారం ఉదయం శైల మల్లన్నను దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు అభిషేకాలు చేసారు . వేద పండితులు , ఆలయం వారు సంప్రదాయానుసారంగా స్వాగతం పలికారు . శ్రీశైలం దేవస్థానం ఇంచార్జ్ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు హరీశ్ రావు దంపతులకు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో గర్భగుడిలోకి తీసుకువెళ్లారు. ముందు ఆలయ ధ్వజ స్తంభం వద్ద పూజలు జరిపించారు. తరువాత శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు హరీశ్ రావు దంపతులు అభిషేకాలు జరిపారు . వీరు ఆలయ వేద పండితుల ఆశీర్వచనం పొందారు .