నల్గొండ: నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం ఒద్దిపట్ల పడమటితండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో పదిమంది మృతి చెందారు . వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్పీ కాల్వలో పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు అంచనా . ట్రాక్టర్ ఒద్దిపట్ల నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను పొలాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది .
కాల్వలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో కొంతమంది కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
గల్లంతైన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతులు రమావత్ సోన (70), రమావత్ జీజా (65), జరుకుల ద్వాలి (30), రమావత్ కెలి (50), రమావత్ కంసలి (50), బానవత్ బేరి (55), రమావత్ భారతి (35), రమావత్ సునీత(30)గా గుర్తించారు.
ట్యాంకర్ బోల్తా:
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై పాల ట్యాంకర్ బోల్తా పడింది . నాగపూర్ నుంచి ఉప్పల్ కు ఓఆర్ఆర్ మీదుగా వస్తున్న సమయంలో ఘట్ కేసర్ వద్ద అదుపు తప్పి ఓఆర్ఆర్ పై నుంచి కిందపడి పోయింది. డ్రైవర్ వెంకటసుబ్బారావు గాయపడ్డాడు . ట్యాంకర్ లో నుంచి 15 వేల లీటర్ల పాలు నేలపాలు అయ్యాయి.