శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న ఏడో విడత భజన శిక్షణ కార్యక్రమం ఆదివారం పూర్తయింది . ఈ శిక్షణ కార్యక్రమం గత నెల 23 వ తేదీన ప్రారంభమైంది . హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు . కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన వారికి ఈ శిక్షణ ఇచ్చారు . శిక్షణ పొందిన వారికి దేవస్థానం పలు సదుపాయాలు కల్పించింది . ధర్మ పరిచారక్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవస్థానం వారి కార్యక్రమాన్ని అభినందించారు . ఈ శిక్షణను ఉపయోగించుకుని భజన బృందాల ద్వారా వివిధ ప్రాంతాల్లోన్ని ఆలయాల్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో శ్రీశైల మండల ధర్మ ప్రచారక్ సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు .