శ్రీశైలం పులకించింది . ప్రత్యేకమైన పుష్పపల్లకీ సేవ శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల హైలైట్ .శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకమైన పూజలు చేసారు .దాదాపు 18 రకాల పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిలో ఉరేగించారు . శ్రీమతి నిత్య సంతోషిని బృందం భక్తి సంగీత కార్యక్రమం, సంప్రదాయ నృత్యాలు శ్రీశైలంలో భక్తులను అలరించాయి . మంత్రి మాణిక్యాల రావు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు . మంత్రి పీ పుల్లారావు కుడా శ్రీశైలం దర్శనం చేసుకున్నారు . అనేకానేక భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానం చేసారు . దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్ ఇతర అధికారులు , అర్చక స్వాములు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు .