గజ్వేల్ పట్టణంలోని టిఫిన్ సెంటర్లపై నగరపంచాయతీ కమీషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. టిఫిన్ల తయారీలో నిర్వాహకులు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు,వినియోగిస్తున్న నూనె,తాగునీరు, పిండిపదార్థాల నాణ్యత తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు. – చైతన్య, గజ్వేల్.