గుడి లేదు గోపురం లేదు
అర్చన లేదు
అభిషేకం అంతకన్నా లేదు
తీర్థం లేదు తియ్యని లడ్డూ లేదు
మడి లేదు ..మంగళహారతి లేదు
కొలవడానికి ఓ..రూపం లేదు
కలవడానికి ప్రత్యేక దారుల్లేవు..
ఉన్నదొక్కటే నమ్మకం… ‘అమ్మ’ తమ ఆకలి తీరుస్తది..తమ పిల్లాపాపలను చల్లగా కాపాడుతుంది అన్నదే భక్తుల విశ్వాసం..
ఆ…నమ్మకమే భక్తుల పాలిట ఇల వేలుపు సమ్మక్క-సారక్క.
గురువారం రాత్రి చిలకలగుట్ట వనం నుంచి జనంలోని మేడారం తన గద్దెపైకి వచ్చిన ఉద్విగ్న క్షణాలు.. సమ్మక్క తల్లికి శతకోటి వందనాలు పెడుతున్న భక్త జనం.
తెలంగాణ కుంభమేళ
🙏సమ్మక్క-సారలమ్మ జాతర 🙏
-చైతన్య , గజ్వేల్.